చెంగల్వ

చెంగల్వ బురదను ఒలుచుకుంటూ వికసించిన కలువ కుంట సామ్రాజ్ఞి చూపులను కట్టేసుకుందంటె అదృష్టం కాదేమో కష్టాలను చిలకడం కుళ్ళు కుచ్చితాల నడుమ నర్తించినా ఇసుమంత తాకకపోవడం దానికి బాగా తెలుసు అందుకే నిటారుగా నిలబడి ఒక సందేశం విసరుతుంది. శారదాహన్మాండ్లు.

ఉట్టి

ఉట్టి అమ్మ దాచిన 'కమ్మ"ను ఒడిలో మోస్తూ నట్టింట ఊగే ఉట్టి పల్లీయుల దృశ్య కావ్యం పిల్లితో సహా బాల్యమంతా చూపుల రాళ్ళు విసిరి తిన్న అమ్మ చేతి అమృతం మూతి చుట్టూ చిత్ర కావ్యం ముసి ముసి నవ్వులు మూతి ముడుపులో దాసుకొని లేని కోపాన నర్తిస్తూ విసిరిన తిట్లు ఓ అద్భుత పద్య కావ్యం భగవంతునికి చిలిపితనాన్ని నేర్పిన ఉట్టి అదే వారసత్వాన్ని బాల్యానికి అందిస్తూనే ఉంది. శారదాహన్మాండ్లు.

నోటు

బొడ్లె సంచిల పోకల డబ్బల దాచిన పాత నోటు దీని ముందర ఎన్ని కష్టాలు కండ్ల నీళ్ళు బొర్లి పొయినయి ఏండ్ల నాటిసంది ఎన్నుపూసోలె దైర్నమిచ్చె కాగుల గింజలోలె పానంకు నిశ్చింతమాయె బొడ్లె సంచిల బద్రంగ ఉన్నదనే పెయి మరిసి కునుకు తీస్తి గిప్పుడు గీ నోటు నడదంట మరి బత్కెట్ల నడుసుడు లోకంతీరు తెల్వని బతుకు గీ నోటు లెక్కాయె అంతా మంచికేనని పెద్దమనుసులంటున్నరు నోటుకు గింజలువోయి వస్తువు మార్పిడివస్తే నల్ల నోట్లుండయేమోంట! శారదాహన్మాండ్లు.

poetry picture

కార్తీక కిరణం

వెచ్చనైన కిరణమిచ్చగించ జనులు
సూర్య సమము దీప కార్యమెఱిగి
వేగు చుక్క రీతి వెల్గుచూ కార్తీక
మాసమెంత దివ్య మాస మాయె.