విస్తరాకు

విస్తరాకు పచ్చటి మోదుగాకులు ఒకదానికొకటి క్రమంగా కుట్టుకున్న విస్తరి అన్నిరుచులను ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది జీవితం వడ్డించిన విస్తరి కాదు ఆకుల్ని మనమే తెచ్చుకోవాలె. కుట్టుకోవాలె అందంగా వడ్డించుకోవాలె ఇది ఒక కళా కౌశలం నేను అనే ఆకుకు కుటుంబం, సమాజం, బంధువులు, స్నేహితులు,ఉద్యోగం,ఆత్మీయులు లాంటి అనేకానేక ఆకుల్ని ఆప్యాయంగా కుట్టుకోవాలె ప్రతి ఆకు లో కొంత భాగమే నీతో ముడిపడిఉంటుంది ప్రతి ఆకుకు స్వతంత్ర అస్తిత్వం ఉంటుంది నాది నేను ను పక్కన పెట్టి బంధాల ఆకుల సహకారంతో జీవితం విస్తరిని తీర్చిదిద్దుకోవాలి కష్ట సుఖాలలో చుట్టూబంధాలవైపు దృష్టి సారిస్తాం కానీ మన అనే ఆకు క్రిందనే మనను దృఢపరుస్తూ చివరి వరకూ తోడుండే మరో ఆకు కనబడకుండా ఉంటుంది ఆ ఆకే పరమాత్మ.

No comments:

Post a Comment