మన పతాకం
నువ్వు నేనూ
ఓ నడిచే పతాకం కావాలి
మనసు నిండా త్రివర్ణ గంధాన్ని అలదుకొని
ఉప్పొంగిన నరాన్ని
విచ్చుకున్న గళాన్ని పెనవేసుకొని
అహింస గానాన్ని పాడాలి
నాటి త్యాగాల భూమికపై
ఎగిరిన ఆ జెండా
నేటి స్వార్ద మేఘాలను చీల్చుకొని
వినీల విశ్వమై ఎదగాలి
రేపటి మన జెండా
విశ్వ గౌరవ వందనం అందుకోవాలి
బోసి నవ్వులన్ని ఏరి
జెండా లో ముడివేశాను
అది పురివిప్పినపుడు
రాలిన ఓ చిరునవ్వును
ఎదపై ధరించు
స్వాతంత్ర బిత్తికపై
భావి తరాన్ని
నేనిపుడె చిత్రిస్తున్నా .