ఎగురుతోంది జయ పతాక మేగురుతోంది
భారతీయ జయ పతాక మేగురుతోంది
మువ్వన్నెల జయపతాక మేగురుతోంది
విజయాన్నే సూచిస్తూ వెలుగుతోంది `` ఎగు``
వినయ విధేయతలే మా పుట్టినిల్లుగా చేసి
మంచి మర్యాదలే గోరుముద్దలుగా పెట్టి
నేర్పుతారు గురువులు మా జీవిత బాటలు
సుమాంజలులే మా కంటి వెలుగులకు `` ఎగు``
కుల మతాలు లేవు మా పాటశాలలో
గురువు కోపతపాలే మా మంచి దీవెనలు
చదువుతాము చదువులు పొందుతాము పదవులు
ఎన్నటికి మరువలేము మా మదిలో ఈరూపం `` ఎగు`` భారతి మంగళ గీతము
తల్లి నీదు గానమే
నా జీవితాన ధ్యేయమే
సర్వ మంగళ గీతమే
నా జీవిత పరమార్థము `` తల్లి ``
నీ ఒడిలో ఒక గడియైన
బ్రతుకు చాలును
నా మదిలో నీ రూపమే
సదా ప్రతిష్టింతును `` తల్లి ``
నిన్ను నమ్మకున్న వారికి
పిడికెడు మెతుకే కరువా
మమ్ము సదా కప్పడుటే
కన్నా తల్లి బరువా `` తల్లి ``
నీవిచ్చిన ఈ బుద్ధిని
నిరంతరముగా నిలుపుమమ్మా
నా మదినే పుష్పముగా
నీ పాదాలర్పింతునమ్మ `` తల్లి ``
వందనం
వందనమమ్మా భారతి
మాన్యులను కన్న తల్లి `` వందన ``
కవులకే కల్పవల్లి
కవిత్రయము జన్మనిచ్చి
కావ్యాలను వెలువరించి
సాహిత్యపు పూదోటలో
సుగందాలు నింపినావు
`` వందన ``
శ్రీనాథుని లేఖినివై
నవ సాహితీ కన్యకవై
శృంగారపు రసనిధివై
పట్టు కొమ్మ వైనావు
`` వందన ``
భక్త పోతనా కవితో
భాగావతానందుకొని
మందార మకరంద
మాధురిలో తేలినావు
`` వందన ``
కృష్ణదేవరాయల
అష్టదిగ్గజాలనిచ్చి
ప్రభందాల వెల్లువను
జగతికి అందించినావు
`` వందన ``
అన్నమాచార్యుల
త్యాగయ్య , క్షేత్రయ్య ల
పద కవితా కీర్తనలతో
అలరారినావమ్మ
. `` వందన ``
శతక దండక చాటు
యక్ష గాన జానపద
చిత్రకవిత్వాలతో
కమ్మదనాని నింపినావు
`` వందన `` -----------------------------------------------------------------------
శ్రీ రామ
శ్రీ రామ ..... రఘురామ ....పావనరామ
శ్రీరామ నీ నామమూ
ఎంతో మధురము , మరెంతో పావనమూ
రఘురామ నీ చరితమూ
ఎంతో మధురము మరెంతో పవనమూ
ముగ్గురుతల్లుల ముద్దులపట్టివి
ముగ్గురు తమ్ములకు ప్రాణమైతివి
సీతమ్మ మదిలో కొలువైన దేవా
సీతా సమేత పట్టాభిరామ
తనది మాటకై కానలకేగిన
సత్య పరిపాల దశరథనందన
రాతిని నాతిగ చేసిన దేవా
పతిత పావన కారుణ్యరూపా
నిన్నే నమ్మిన వానరసేనకు
మిత్రుడవైతివి పావనరామా
అంజని సుతుని భక్తికి మెచ్చి
మదిలో నిలిపిన భక్తవరదరామా
------------------------------------------------------------------------
------------------------------------------------------------------------
వసంత కోయిల
వసంత రాగం తో కోయిల పిలిచింది
కోటి గుండెల
చిగురు ఆశను నిద్దురలేపింది ( వసంత)
కుహూ కుహూ పాటలతో
ప్రకృతి పులకించింది
మావి పూత గుభాళింపుతో
పిల్లగాలి మురిసింది
వేసంగి వెన్నెలే మైమరచిపోయింది
మా పెరటి మల్లియ రేకు విప్పింది ( వసంత)
ఆకు రాల్చు కాలానికి
కొత్త ఊపిరులనిచ్చింది
వసంతుని రాకకు
స్వాగతం పలికింది
పూగుత్తుల సోయగాలతో మత్తెక్కికూసింది
వేసారిన మనసులను ఉయాలలూపింది ( వసంత)
----------------------------------------------------------------------
సెంద్రి
ఎన్నేలెంత వేడైతే
----------------------------------------------------------------------
సెంద్రి
నీలాల సంద్రం లో
నిండా మునిగేటి
సక్కనైన సూరీడా
ఎల్లి పోమాక
నీ సెంద్రి వచ్చెను ఎల్లి పోమాక
ఎన్నెలంత సీరకట్టు
మల్లె పూలు సిగను సుట్టి
సోకు సేసు కోస్తాది
నీ సెందురమ్మ "సోకు "
ఎన్నేలెంత వేడైతే
వగలన్ని సెగలైతే
అలిగికూకుంటాది
నీ సెందురమ్మ " అలిగి "
వేగు సుక్క వేలైతే
లోకమంతా మేలుకుంటే
ఆ ఏళనువ్వొస్తే
ముడుసుకుపోతాదీ నీ సెందురమ్మ
సిగ్గుతో కంది పొతాదీ నీ సెందురమ్మ ( నీలాల)
-----------------------------------------------------------------------
అమృతం
అ అంటే అమ్మని
చదువుతారు అందరు
అమ్మంటే అమృతమని
తెలుసుకుందురెందరు
నలుసంత మాంసాన్ని
బొమ్మను చేసి
ప్రాణాన్ని ఫణం పెట్టి
ప్రాణం పోసి
నిలువెత్తు మనిషిని
నిన్ను చేసింది
నీలోనే తనను చూసి
మురిసిపోయింది ( అ అంటే అమ్మని )
రక్తాన్ని పాలు చేసి
చిన్ని పొట్ట నింపింది
నీ చిరు నవ్వులు చూసి
కడుపు నింపు కుంది
అక్షరాలు నేర్పి తాను
ఆది గురువు అయ్యింది
మంచి చెడులను చూపి
ఆదర్శ మయ్యింది ( అ అంటే అమ్మని )
కష్టాల్లో నిన్ను చూసి
కళ్ళ నీళ్ళు పెట్టింది
కంటికి రెప్పల నిన్ని
కాపాడుకుంది
కలకాలం నీతోనే
గడపాలనుకుంది
చేజారిన నిన్ను చూసి
తల్లడిల్లుతోంది ( అ అంటే అమ్మని )
కడుపున మోసిన తల్లిని
కడదాకా మోయాలి
మాత్రు ఋణం తీర్చుకోను
మమతరుణం నీవు పంచాలి
కనిపించని ఆది దేవుని
అమ్మలోనే చూసుకో
ఆమె సేవ లోనే ముక్తి
నీకుందని తెలుసుకో ( అ అంటే అమ్మని )