బాలగేయాలు

*బాల గేయం*
*చెట్టమ్మ*
చిట్టి చిట్టి చేతులతో 
మొక్క నాటుదాం 
నీరు పోసి కంచి వేసి కాపాడుదాం 
అమ్మ నాన్న పేరు పెట్టి ఆడుకుందాం 
ప్రతిరోజు చూసుకుంటూ 
స్నేహం చేద్దాం
తొలి ఆకు తొడిగితే 
తేలిపోదాం 
మారాకు తొడిగితే 
మురిసిపోదాం 
ఇంతింతై వృక్షమై 
ఎదగనిద్దాం 
ఆ ఆకు ఈ కొమ్మ
ఆ మొగ్గ ఈ పువ్వు 
ఆ కాయ ఈ పండు 
ఇచ్చేటి చెట్టమ్మకు 
దండంపెడదాం
ఆ చెట్టు నీడలో 
ఆడుకుందాం 
కలిసి పాడుకుందాం.
--డా.శారదాహన్మాండ్లు.

చినుకు చినుకు రాలింది దోసిలి పట్టు 
పెద్దవానై కురిసింది 
ఇనుకుడు గుంతను కట్టు 
నీరేగా ఆధారం 
నీరే మన ప్రాణం 
చెరువులుగా కుంటలుగా నీటిని దాచిపెట్టు
పచ్చగ పంటలు 
ఎదగాలన్నా 
స్వేచ్చగా చేపలు 
ఈదాలన్నా
ఇంటి నిండా లైట్లు 
వెలగాలన్నా
మనిషి హాయిగా 
బ్రతకాలన్నా
నీటిని పొదుపుగా 
కూడబెట్టు 
రేపటి మన సోదరులకు
దాచిపెట్టు.
--డా.శరదాహన్మాండ్లు.










No comments:

Post a Comment