అమ్మమ్మకు పానం బాగా లేదని ఫోన్ వచ్చింది .శాన్నాళ్ళకు అమ్మమ్మ ఊరు పోయే అవకాశం వచ్చింది .మిషన్ లెక్క పనిచేసే బతుకులో మనసు రోజుకోక్కపారయినా ఊరుపోయస్తది.కాని కాళ్ళు ఈడనే ఉంటాయి .అంటూ బట్టలు సర్దుతున్నది లలిత .
అమ్మమ్మ ఊరు యాదికిరాంగానే సంతోషం పాదరసం లెక్క పెయ్యంత పాకింది .మనసు గాలిలో తేలిపోయింది లలితకి.
రమ్యా జల్ది జల్ది బట్టలు సర్దుకో మనం తాడూరు పోదాం.అంటూ బిడ్డను బిగ్గరగా పిల్చింది .అబ్బఎన్నిరోజులనుండి అడుగుతుంటె ఈ రోజు కుదిరిందా రోజూ నీ కథలల్లో ఊరు చూపించేదానివి ఈ రోజు అది నిజమవుతున్దన్న మాట అంటూ హుషారుగా తయారయింది రమ్య .
బస్సు కన్నా వేగంగా మనసు పరుగెడుతుంది లలితది అప్పుడు అమ్మతో తను ఇలాగే అమ్మమ్మ ఊరికి పోతుండె.ఇప్పుడు నా బిడ్డతో పోతున్న అందర్నికలవాలి అంటూ గతంలోకి వెళ్ళింది.
తల్లిగారింటికి అనంగనే అమ్మ ముఖం దీపమోలె ఎలిగి పోతుండె .రెండు జడలేసి రెండు జడలకు పువ్వులు పెట్టి చెల్లెను తనను ప్రత్యేకంగా తయారు చేస్తుండె. అన్నయ్య అల్లరి చెప్పనక్కర్లేదు. సిరిసిల్ల బస్సు దిగంగనే ఊర్లకేల్లి నడుసుకుంటూ రాదారెంట తాడూరు పోవాలె.
గల్లిలల్లకెళ్ళి పోతుంటే మగ్గం సప్పుళ్ళు ఇనవడుతుండె. ఇంటింటికో మగ్గం రాట్నం వడుకుకుంట, పోగులకు రంగులేసుకుంట అరుగుల మీద జనాలు హడావుడిగా కనబడేవారు. చిన్నప్పుడు మగ్గం నేసుడు సూసుడుకంటే ఎంత గమ్మతో. ఇండ్లు కథం కాంగనే మామిండ్లు వస్తుండే. తీయ మామిడి వాసన లేని ఆకలిని గుర్తు చేస్తుండే. ప్రతి చెట్టును ప్రతి కాయను చూస్తూ నడిచేవాళ్ళం. తెలిసిన వాళ్ళు తెంపించిన కాయల్ని తింటూ నడుస్తుంటే వాగోచ్చేది.
ఎండా కాలం కదా ఇసుకలో శానాసేపు నడిసినంకనే వాగోచ్చేది. ఎంత ఎండలు కొట్టిన వాగు మోకాలు లోతు పారేది. వాగుల మాదుంకుడు సూడలే. మోటబాయికి రెండు ఎడ్లు కట్టి పొలాలకు నీళ్ళు పారిస్తూ నారాయణ తాత కనబడుతుండే పచ్చని పొలాల గట్ల మీద నడుసుడు. మధ్య మధ్య జారి బురదల కాలుపడుడు గమ్మతుంటుండె. ఊర్లె కాలు పెట్టంగనే ముందుకు ముందు శివుడి గుడి.
ఇగ ఖతం అమ్మ దారి అమ్మది మా ఒరుకుడు మాదే. అమ్మను ప్రతి ఇంట్లోళ్ళు పలకరించుడు అలయిబలాయిలు. మేము అమ్మమ్మ ప్రేమ, చిక్కటి పాలగోకు. మామతో వాగుల ఆటలు. అత్తమ్మ గారేప్పలు. గుడిసెల దుంకులాటలు. అబ్బో నెలరోజులు ఎట్లగడుస్తుండేనో తెల్వకుండే.
పొద్దు పొడుపు లేత కిరణాలు వెచ్చగా ముఖాన్ని తాకగానే ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు నారాయణ.
తుఫాను కారణంగా ఎడతెరిపి లీకుండా కురిసి అలసి పోయిన వాన ఒక్కసారిగా ఆగిపోయింది. మూడు రోజులుగా మేఘాల దుప్పట్లో వెచ్చగా నిద్దురపోయిన సూరీడు దర్శనమిచ్చాడు.
కోతకొచ్చిన పొలం కళ్ళ ముందు మెదిలింది నారాయణ కు మొత్తం పంటంత నీళ్ళ మునిగి ఉండవచ్చు. మునగకుండా ఎలా ఉంటది. అకాల వర్షాలు ముంచడానికే వచ్చే అనుకుంటూ పొలం వైపు అడుగులేసాడు బుజాన పారతో
పొలాలన్నీ చేరువులయ్యాయి ఎక్కడ చూసినా నీళ్ళే. వరి అంతా నేలపై పన్నది రైతులంత పొలంల నిలిచినా నీళ్ళను వంపు వైపు కాలువలు చేసి పారిస్తున్నారు.
నారాయణ కు పొలం పరిస్థితి చూసి గుండె దడ పెరిగింది ఈ యాడాది మంచిగా వానలుపడ్డయి. ఇల్లు గట్టిన బాకీ కొంత తీర్చేయాలని పెట్టుబడి గూడ బాకీ జేసినా , బాకీ సంగతి దేవుడెరుగు తిండి గింజలు చితి కస్తే చాలు అనుకుంటూ గండ్లు తవ్వడం మొదలు పెట్టాడు .
ఎండ నేతి కొచ్చే సుశీల ఇంకా రాకపాయే. అనుకుంటూ ఊరివైపు చూసాడు నారాయణ నెత్తి మీద సద్దిగుల్లతో దూరంగా సుశీల కనబడింది . కాళ్ళు, చేతులు కడిగి ఒడ్డు మీద కూర్చున్నాడు నారాయణ .
ఉన్నోల్లింటి కేళి వచ్చిన ఏనాడు దేనికి సతాయించింది గుర్తులేదు . అవసరాలు ముందే గుర్తుపట్టి సంసారం సగబెట్టుట్ల సుశీల కు ఎవలూ సాటిరారు . ఇదే లేకుంటే నేను గిట్ల బతికేటోన్న. ఊర్లె గింత పెరున్నదంటే నా సుశీల జేయ్యంగనే అనుకుంటూ సుశీల వైపే చూస్తున్నాడు నారాయణ
గిదేందయ్యా పంటంత నెల పాలాయె. సంసారం ఎట్లా నడవాలా. అప్పులేట్ల తీరాల. వానసల్లంగుండా అంటూ సద్ది గుల్ల దించింది.
ఎన్నడన్నా బల్లె కాలు పెట్టినమా. నా కొడుకెట్ల సదువుతున్నాడని అడిగినమా.
తల్లికి కోపం వస్తే ఎం జరుగుతుందో తనకు బాగాతెలుసు. అందుకే బుద్దిగా తన ప్రణాళిక మార్చుకున్నాడు చిన్నోడు.
పెద్దోడు ఇంటికి వస్తూనే అమ్మ అన్నం అంటూ కంచం ముందు కూర్చున్నాడు. గిన్నెలో ఉన్న కొంచెం అన్నాన్ని వడ్డించింది సుశీల.
ఎన్నడన్నా బల్లె కాలు పెట్టినమా. నా కొడుకెట్ల సదువుతున్నాడని అడిగినమా.
``గా ముచ్చట్లంత మనకేట్లర్థమైతదే, మంకేమ్తేలుస్తది.``
తెల్వది తెల్వది అంటానే గీడిదాకచ్చింది . ఎప్పటిడప్పుడు అరుసుకుంటే గిట్లుండకుండే. సదువుకొనటోడికి పనేంజెప్పలే
అంటిమి ఆడు పంకిరాకుంటబాయె.
అంటే సిన్నప్పటినుంచే పనిజేప్పేదుండే అంటవా.
`అవు మల్ల సదువు సదువే పని పనే చిన్నోనన్న గిప్పటి నుంచే దారిలబెట్టాలే.
మంచి ముచ్చటంటివె . లేకుంటే నడిసేటట్టులేదు. మరి పెద్దోని గతేంది. ఎం జేద్దమంటవ్.
వానిసంగతి నెజూసుకుంటగని మాటల్లవడి నువ్వు సరిగతిననే లేదు జర తిండి మీద ద్యాస పెట్టు `, అంటూ సద్ది గుల్ల సర్దింది.
భర్తతో పాటు కాసీపు నడుం వంచింది. అంటికి వెళ్తూ మంచే మీదికి పారిన ఆన్యపు తీగ వెతికి ఒక కాయను తెంపుకొని బయలుదేరింది.
గోధూళి ఎర్రదనం, సందె వెలుగు ఎర్రదనం తో కలిసి వాతావరణం మరింత ఎర్రపడింది పక్షుల కిలకిలలెవీ సుశీల చెవికి సోకడం లేదు. పెద్దోడి గురించే ఆలోచించుకుంటూ ఇల్లు చేరింది సుశీల.
చిన్నోడు బడినుండి వస్తూనే పుస్తకాల సంచి అరుగు మీద పడేసి వాకిట్లోకి పరుగుతీయబోయాడు `కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, బర్రెల్ని జర కట్టేసి గడ్డేయిర చిన్నోడా . అనా తల్లి అరుపు విని వెనక్కు తిరిగాడు చిన్నోడు.
మార్కులు తక్కువచ్చినయంటగద సారు జెప్పిండు. పుస్తకాలు ముందేసుకొని కుసో .
టీ.వీ గీవి అని పోయేవ్ అని గదమాయించింది సుశీల
పెద్దోడు ఇంటికి వస్తూనే అమ్మ అన్నం అంటూ కంచం ముందు కూర్చున్నాడు. గిన్నెలో ఉన్న కొంచెం అన్నాన్ని వడ్డించింది సుశీల.
గిదేందమ్మ సగం కడుపుకే వండినవ్.
అవు మల్ల ఒక్కడు జీస్తే ఐదుగురం కుసుండి తినవడ్తిమి. సగం కడుపుకు గాకుంటే నిండ దొరుకుతద కొడుకా.
నాయన దుకాన్ ల జీతం మాట్లాడోచ్చిండు. పోద్దుగాల్లేసి సద్దిగట్టిస్త పోయి బుద్దిగ పనిజేసుకో అన్నది సుశీల
నేను దుకాన్ల జీతముండన్నా మల్ల పరీక్ష రాసేది ఉన్నది నాకు. నేను పోను. అన్నాడు దూకుడుగా.
అంత సార్ తోని మాట్లాడి ఫీజు గట్టి వచ్చిన. పరీక్ష ముందట ట్యూషన్ జెప్తనన్నడు. అప్పటి దాక పనికి పోలేకుంటే అందరం సగం కడుపుకే తినాల. అంటూ గిన్నెలు సర్ది అటు తిరిగి పడుకున్నది.
నాల్గు రోజులుగా ఇంట్లో అందరికి కొద్దిగానే వంట జీసింది సుశీల కావాలని
అమ్మ నాయినతో ని పొలం పనికి పోత దుకాన్ల జీతముండ ఆనాడు పెద్దోడు. ఇక కుదిరెట్లు లీదని.
నీ ఇష్టం రా. ఏదైనా సరే మాకింత అన్నం పెట్టె పని నీర్సుకో సాలు అనాది సుశీల కోటి దేవుళ్ళకు మనుసులో మొక్కుకుంటూ.
సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి భుజాన కొడవలితో పొలం వైపు నడిచాడు నారాయణ .
హమ్మయ్య వారి గాలికి బాగా ఆరింది. అంటూ యదా లాపంగా వెనక్కి తిరిగి చూశాడు. నారాయణ్ ముఖం
వెలిగి పోయింది. తెర వెనుకే నడిచి వస్తున్న కొడుకుని చూసి.
చీకటి తెరల్ని చీల్చుకొని వెలుగులు విరజిమ్ముతూన్నాడు సూర్యుడు.
శారదహన్మాండ్లు,
నిజామాబాద్.