నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
ఒక కన్ను వర్షపు జల్లుల్లో
హరితాన్ని తడిమి సింగిడై పూస్తది
ఒక కన్ను మోడైన పుడమికి
పచ్చని ఆచ్చాదనాన్ని మెచ్చి ఇచ్చగా ఇస్తది
ఆరు ఋతువులను కాటుకగా
మూడు కాలాలను కన్నులుగా
ప్రసరిస్తున్న సూర్యుని
మూడో కన్ను ఎండాకాలం
ఈ కన్ను తెరవకుంటే
మిగితా కన్నుల పండుగ ఉండదుగా
నేటి శిట శిట లే
రేపటి చిటపట చినుకులు
బువ్వ మొలకలు
సిరుల పిలుపులు.
శారదాహన్మాండ్లు
Subscribe to:
Posts (Atom)