సృష్టి రహస్యానికి సాక్షం
మానవత్వ పుట్టుకకి స్థానం
మానవత్వ పుట్టుకకి స్థానం
నీలో అడుగు పెట్టగానే
అపరిచిత నేత్రాలు
పరిచాయలకై చేతులు చాస్తాయి
ఆ పరిచయం ఆప్తమై
తనలోకి లాక్కొని
కొత్త ప్రపంచం లో
విజ్ఞాన యాత్ర చేయిస్తుంది
నీ పేజీల గూడు మధ్యనే
గొంగళి సీతాకోక చిలుక అయ్యేది
నీ బోధ తలకెక్కించుకుంటే
మనసు నగ్నమై
తప్పొప్పుల దర్శనంతో
పునితమవుతుంది
నువ్వు జీర్ణమై
పల్లీ ల పొట్లమైన
నీ అక్షర హస్తాలు
ఓదార్పు పంచుతాయి
అలసిన తనువు
అక్షరాల్లో కనురెప్ప వాలడం
ఎంత హాయి
నీ ఎదపై నెమలీకై
మెరిసే
మనిషే మనిషి .
No comments:
Post a Comment