నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
ఉట్టి
ఉట్టి
అమ్మ దాచిన 'కమ్మ"ను
ఒడిలో మోస్తూ
నట్టింట ఊగే ఉట్టి
పల్లీయుల దృశ్య కావ్యం
పిల్లితో సహా బాల్యమంతా
చూపుల రాళ్ళు విసిరి
తిన్న అమ్మ చేతి అమృతం
మూతి చుట్టూ చిత్ర కావ్యం
ముసి ముసి నవ్వులు
మూతి ముడుపులో దాసుకొని
లేని కోపాన నర్తిస్తూ
విసిరిన తిట్లు
ఓ అద్భుత పద్య కావ్యం
భగవంతునికి చిలిపితనాన్ని
నేర్పిన ఉట్టి
అదే వారసత్వాన్ని
బాల్యానికి అందిస్తూనే ఉంది.
శారదాహన్మాండ్లు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment