దొంతులర్ర

దొంతులర్ర వరుసలుగా పేర్సిన కుండలతో నిండుకున్నదన్న మాటేలేని తిండిగింజలతో పల్లెతల్లి అన్నపూర్ణనిలయం దొంతులర్ర నట్టింట పెద్దనుండి చిన్న వరుసలుగా నిలబడి ఇంటిపెద్ద నాయనమ్మవైపు కుండలన్ని గౌరవంగా చూసేవి ఎందుకంటే కడిగి సున్నంతో అలికి పూదిచ్చి కుండలను నిండుముత్తైదువులను చేసేది నాయనమ్మనే కదా దొంగతనంగా అటుకులకై దొంతులర్రల కాలుపెట్టంగనే పోలీసులా ప్రత్యక్షం దొంతుల మట్టివాసనకై పోటీలుపడి అలికిన చేయికి ఆ జ్ఞాపకం వాసన మిగిలే ఉంది ఇరుకైన అర్ర అక్కచెల్లెండ్ల ముచ్చట వినడానికి విశాలమైన ఎదను పరిచేది దొంతులర్ర ఉమ్మడి కుటుంబ చిహ్నం తాత నాయనమ్మలతో పాటు దొంతులర్ర ఒక సజీవ మధుర దృశ్యం. శారదాహన్మాండ్లు.

No comments:

Post a Comment