నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
పాత క్యాలెండర్
పాత క్యాలండర్
గోడకు అనుభవాల బరువుతో
వంగిన తాతవోలె
ఇచ్చి పుచ్చుకున్న లెక్కల గీతలు
శభాశుభాలచుట్టూ గుర్తులు
అమ్మకు మాత్రమే అర్ధమయ్యే రాతలు
పాత క్యాలెండర్ ఓ ఏడాదిని మోస్తూ
అవగత మవుతూ
కొత్తకు సగౌరవ స్తానం ఇచ్చింది
ఎంత హుందాతనం
చిన్నప్పుడు పాత క్యాలెండర్ ఒక
కొత్త లెక్కలకాపి
వెనుకున్న తెల్ల పేజీలకై
అన్న చెల్లె నేనూ కొట్లాట
ఇప్పుడాపని తప్పింది
ఏ బరువులూ లేని కొత్తది
ఎగిరెగిరి పడుతున్నది
నూత్న లక్ష్యాల గుర్తులు
సంబురంగా గీసుకోండి.
శుభాకాంక్షలతో
శారదాహన్మాండ్లు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment