ఆకాశ స్క్రీన్ పై
సూర్యుడు లాగిన్ అవ్వగానే
సూర్యుడు లాగిన్ అవ్వగానే
బ్రెడ్ ముక్కల్ని
బ్రేక్ లేకుండా ఫాస్ట్ గా కానిచ్చి
ఇయర్ ఫోన్ పాటలకు
లయబద్దంగా క్యాట్ వాక్ చేస్తూ
నిస్త్రంత్రి యుగంలోకి
అడుగు పెట్టింది కోకిల
కంప్యూటర్ ని
కనుపాపలలో పొదుగుకొని
కీ బోర్డు పై తరంగ నాట్యం చేస్తూ
నెట్ వట వృక్షంపై
వెబ్ సైట్ గూళ్ళ అన్వేషణ
మెరుపు వేగం తో
విశ్వాన్ని చుట్టే
మేధో సంపత్తి తన సొంతం
మనో భావాల తాయిలాన్ని
బ్లాగుల్లో భద్రపరచడం
లిప్త కాలం లో
ఇ-మెయిల్ లో కబురంపడంలో
అందె వేసిన చేయి
మాట్రిమోని ప్రొఫైల్స్ లో
భాగస్వామిని ఎన్నుకొని
వెబ్ కెమెరా ముందు చాటింగులు
ఆగ మేఘాల మీద అక్షింతలు
తన జీవితాన్ని తానే
సెట్టింగ్ చేసుకోగల
అవసరమైతే ఫార్మాట్ చేసుకోగల
నిపుణి
అనుభందాలను డిలీట్ చేయడం
స్నేహాన్ని కట్ చేయడం
పేస్ట్ చేయడం
పాత తరాన్ని రీసైకిల్ బిన్ లో
వేయడం అలవాటే
తోలి ఉగాదికి
తన బెటర్ ఆఫ్ కి
రెడిమెడ్ పచ్చడిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్
నుండి తెప్పించిది
బొంజాయి మామిడి ఆకుల్ని
తోరణాలుగా కట్టి
వాల్ పేపర్ పై పకృతి సీన్
పెట్టుకుంది.
మీ ‘పై’నికి నా జోహార్లు.. సూపర్బ్ కేక. కెవ్వు కేక కూడా..
ReplyDelete