కాంక్రీటు గుండెల రాజకీయ రాహువు కు
బలైన సూర్యుళ్ళెందరో
కన్న మట్టి తల్లి పాదాల చెంత
మహూజ్వల ఆశయ ఆత్మజ్యోతులు
కాలిన దేహాలు
ప్రచండ పిడికిళ్ల పురిటి కాగడాలు
ఆదేహ దేవాలయంలో
త్యాగాల దోర్ణం మధ్య
స్వతంత్ర్య స్వరాష్ట్ర ద్వజం
అమరత్వ నైవేద్యం
No comments:
Post a Comment