కొత్త బానిసను



అందమైన  స్వప్నంలో
రాకుమారిని నేను
పరదాల అంతః పురంలో
సరికొత్త బానిసను నేను
 వర్ణాలన్నీ వెలిసిపోయి
 ఎగరటం  మరచిన
 సీతకోక  చిలుకను నేను 
లక్ష్మణరేఖ వలయాల మధ్య
 సుకుమారంగ గీసిన
బాపు బొమ్మను నేను
పుక్కిటి పురాణాల నడుమ
పాతివ్రత్యాన్ని పావులా మలచబడ్డ
అహల్యను నేను
బంగారు పంజరంలోని
రా చిలుకను నేను
లలిత పల్లవములు బండబారి
కుసుమ కోమల వసంతం
హరిన్చబడ్డ
వన దేవతను నేను
స్వపాకంలో కరివేపాకును నేను
నువ్వు మత్తుగా తాగి
వదిలేసిన బిందువును నేను
  కన్నీటి సింధువును నేను
పదహారణాల పడుచుదనాన్ని  పీల్చేసి
ఆరుపదుల
బహుమానంగా అందుకున్న నేను
ఇప్పుడిప్పుడే
  పరదాలు చీల్చేసి
 రెక్కల  పట్టు భిగించుకొని
వలయాలు చేధించుకుంటూ
కొత్త పథంపై
సరికొత్త అడుగునౌతున్నాను
 అడుగుకి బలమిస్తారా .             

1 comment: