నమస్కారం నా పేరు శారదహన్మాండ్లు, నేను ఉపాధ్యాయురాలిని, మాది ఇందూరు జిల్లా. సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూ సామాజిక సమస్యలపై స్పందనలను కవిత రూపం లో అల్లడం నా ప్రవృత్తి. సమాజం మనందరికి నివాసాన్ని అందించిన కల్పతరువు మూలాలను కాపాడడం ఫలాలను పంచుకోవడం సమానత్వం ప్రదర్శించడం మన భాద్యత,అందుకే నా స్పందనలను మీ ముందు ఉంచుతున్నాను ప్రతిస్పందనలను తెలియ చేయండి. ధన్యవాదాలు.
రెడ్ కార్పెట్
రెడ్ కార్పెట్
కన్నుల నిండా కాంతిని
పులుముకున్నాక
జగమంతా వెల్గు రేఖలే!
చీకటి కాటుకలా మారి
రెప్ప కింద ముడుచుకుంటది
ఆశ విశ్వమెల్ల విస్తరించినప్పుడు
నిరాశ దిస్టి చుక్క కావల్సిందే
అడుగులను సమాయత్తపరచుకొని
తూరుపువైపు పరుస్తుంటే
భానుడు స్వాగతం పలుకడా!
నిత్య నూత్న యవ్వనాన్ని
ఎదనిండా విస్తరించుకొని
పయనాన్ని ఝలిపిస్తే
ఎదురీత సైతం నివ్వెరపోవాల్సిందే
ఎందుకలా
కాళ్ళను ముడుచుకోవడం?
ఆకలిని ఒక్క చరుపు చరువు
దిక్కులదిరేలా పొలికేక పెట్టి
లక్ష్యా న్ని పాదాక్రాంతం చేస్తుంది.
కంటి ముందు
రెడ్ కార్పెట్ ను వదిలేసి
ఊహల్లో పల్లకీని ఎక్కుతానంటావెందుకు
నిజం వైపు దృక్కులను సంధించు
విజయం
బావుటాను ఎగురవేస్తుంది.
కిరణం అంటేనే
చీకటిని చీల్చే పిడిబాకు కదా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment